తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!

2019 సార్వత్రిక ఎన్నికలలో నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) గెలవడం జరిగింది.ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

 Minister Komatireddy Venkata Reddy Resigned From His Mp Post Congress, Nitin Gad-TeluguStop.com

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కొలువుదీరిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.ఈ పరిణామంతో సోమవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ ఫార్మేట్ లో ఎంపీ పదవికి రాజీనామా చేసి స్పీకర్ ఓమ్ బిర్లాకు అందజేయడం జరిగింది.

ఇక ఇదే సమయంలో ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రిని నితిన్ గడ్కరీతో( Nitin Gadkari , ) భేటీ కావడం జరిగింది.

Telugu Bhuvanagiri, Congress, Delhi, Komativenkata, Nitin Gadkari, Om Birla, Ts-

తెలంగాణ రాష్ట్రంలో 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని ఈ సందర్భంగా.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరడం జరిగింది.దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అనంతరం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు.కృషి చేస్తానని స్పష్టం చేశారు.

గత ఐదేలుగా రాష్ట్రంలో రోడ్ల స్థితి చూస్తూ వచ్చాను.కొన్నిచోట్ల రహదారులపై గుంతలు ఏర్పడితే మట్టితో నింపేశారు.

గుంతలు ఏర్పడితే సిమెంటు లేదా బీటీ ప్యాచ్ లు వేసి గుంతలను పుడ్చాల్సి ఉంటుంది.మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో గుంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర రహదారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోల్చితే తెలంగాణకి కేంద్రం నుంచి తక్కువ నిధులు వచ్చాయి.అయితే ఇప్పటినుండి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube