ఉల్లిగడ్డ పంటకు( onion crop ) ఎప్పుడు ఒక స్థిరమైన ధర అంటూ ఉండదు.ఉల్లిగడ్డ ధర ఒకసారి ఆకాశాన్ని అంటితే మరోసారి నేల చూపులు చూస్తుంది.
ఉల్లిగడ్డ కనిష్ట, గరిష్ట ధరల మధ్య వ్యత్యాసం కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.ఉల్లిగడ్డ పంట సాగు చేసే రైతులకు ముందుగా సాగు విధానంపై అవగాహన అవసరం.
ఎందుకంటే ఉల్లిగడ్డ పంటకు పెట్టుబడి వ్యయం కాస్త ఎక్కువే.ఉల్లిగడ్డ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, చౌక నేలలు( Black soils, red soils, cheap soils ) చాలా అనుకూలంగా ఉంటాయి.
చౌడు నేలలు, ఇసుక నేలలు ఈ పంట సాగుకు పనికిరావు.

ఉల్లిగడ్డ నారును ప్రధాన పొలంలో రెండు విధాలుగా నాటుకోవచ్చు.చిన్నచిన్న మడులలో నాటుకుంటే నీటి పారుదల ద్వారా సాగు చేయాలి.ఎత్తు ఎత్తు బెడ్లు ఏర్పాటు చేసుకుని నాటుకుంటే డ్రిప్ ఇరిగేషన్( Drip irrigation ) ద్వారా నీరు అందించాలి.
నారును ప్రధాన పొలంలో నాటడానికి ముందు పేర్లను ఒక శాతం బార్డో కలిపిన మిశ్రమంలో ముంచి నాటుకోవాలి.దీంతో మొక్కలకు నారు కుళ్ళు తెగుళ్లు రాకుండా ఉంటుంది.
మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పైగా ఏవైనా తెగుళ్లు లేదంటే చీడపీడలు పంటను ఆశిస్తే వ్యాప్తి పెద్దగా ఉండదు.

ఉల్లిగడ్డ పంటలో కలుపును( weed ) నిర్మూలిస్తే.పంటను వివిధ రకాల చీడపీడల, తెగుళ్ళ నుండి సంరక్షించుకున్నట్టే.వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నడం వల్ల వివిధ రకాల కలుపు విత్తనాలు దాదాపుగా చనిపోతాయి.ఇక ప్రధాన పొలంలో ఉల్లినారు నాటిన 24 గంటల తరువాత ఒక ఎకరం పొలానికి 1.2 లీటర్ల అలాక్లోర్ రసాయనాన్ని( Alachlor chemical ) ఇసుకలో కలిపి తేమ ఉండే నేలపై చల్లుకోవాలి.ఈ రసాయనం మొక్కలపై పడకుండా చల్లుకోవాలి.
పంట ఎదుగుతున్న సమయంలో కూలీల సహాయంతో ఎప్పటికప్పుడు కలుపు తొలగించాలి.ముఖ్యంగా నారు నాటిన 40 రోజుల వరకు కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక నేలలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులను అందిస్తూ, ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే సకాలంలో గుర్తించి తొలి దశలో అరికడితే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చు.