దారుణం : 11 ఏళ్ల చిన్నారిపై రక్త స్రావం అయ్యేలాగా అత్యాచారం....

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు మరియు చట్టాలు తెచ్చినా మహిళలపై జరుగుతున్నటువంటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.తాజాగా అభం, శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి నిందితుడు పరారైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

 Men Rape Attempt, 11 Years Old Girl, Prakasam District, Crime News, Local News,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.ఈ వ్యక్తికి 11 సంవత్సరాలు కలిగినటువంటి బాలిక ఉంది.

అయితే తాజాగా చిన్నారి తన ఇంటి పరిసర ప్రాంతంలో ఒంటరిగా ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి చిన్నారిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతంలో కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.అంతేగాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో బాలిక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.అయితే బాలిక తల్లి ఆమెకు స్నానం చేయించే సమయంలో మర్మాంగం వద్ద రక్తస్రావం అవుతూ ఉండడంతో ఏమైంది అని ప్రశ్నించగా తన పై జరిగినటువంటి గురించి తల్లికి చెప్పుకొని బోరున విలపించింది.

దీంతో వెంటనే బాలిక తల్లి తన భర్తకు ఈ విషయం గురించి చెప్పడంతో ఒక్కసారిగా అతడు ఖంగు తిన్నాడు.అలాగే వెంటనే బాలికను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బాలికపై జరిగినటువంటి గురించి ఫిర్యాదు నమోదు చేశారు.

దీంతో పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube