స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్, ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది.
కాగా ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ భార్యగా రష్మిక మందన్న నటిస్తోంది.అయితే ఈ సినిమాలో భార్యభర్తల మధ్య కెమిస్ట్రీని సుకుమార్ మనకు చూపించనున్నాడని, ప్రేమికుల లవ్ ట్రాక్ అనేది ఈ సినిమాలో మనకు కనిపించదని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇలా చేయడం సుకుమార్ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ అని చెప్పాలి.
ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.
కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు.టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.