హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఇందుకు దగ్గట్టుగానే ఆయన చిత్రాలు కూడా దాదాపుగా భారీ బడ్జెట్ తో కొడుకుని ఉంటాయి.
అయితే ఆర్నాల్డ్ నటించినటువంటి చిత్రాల్లో టెర్మినేటర్ – 2 జడ్జిమెంట్ డే చిత్రం ఆర్నాల్డ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చింది.అంతేకాక ఈ చిత్రం దర్శక నిర్మాతలకు కూడా మంచి లాభాల పంట పండించింది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని అంశాలను ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో హీరోగా ఆర్నాల్డ్ తన పాత్రకి 100 శాతం న్యాయం చేయడంతో ఈ చిత్రానికి ఆర్నాల్డ్ నటన హైలెట్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో నటించడానికి ఆర్నాల్డ్ దాదాపుగా 15 మిలియన్ డాలర్లు పారితోషకం పుచ్చుకున్నాడు.అంతేకాక ఈ చిత్రంలో ఆర్నాల్డ్ దాదాపుగా ఈ ఏడు వందల పదాలను పలికాడు.
ఇందుకుగాను అప్పట్లో ఒక్కో పదానికి 21 వేల పైచిలుకు డాలర్లను తీసుకున్నాడు.మన భారత దేశ కరెన్సీలో అయితే దాదాపుగా 15 లక్షల రూపాయల పైనే ఉంటుంది.
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్నాల్డ్ కి హాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందని.
అయితే ఆర్నాల్డ్ పారితోషకం తీసుకోవడమే కాక ఆ పారితోషికాన్ని ప్రజల సమస్యలకు కూడా వినియోగించేవాడు.
దీంతో ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించినటువంటి అప్పటి ప్రభుత్వం అమెరికాలోనే పేరుగాంచినటువంటి కాలిఫోర్నియా నగరానికి గవర్నర్ గా నియమించింది. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు తన గవర్నర్ పదవికి ఎటువంటి ఆటంకం రాకుండా పదవీ బాధ్యతలను చక్కదిద్దేవాడు ఆర్నాల్డ్.
అంతేగాక తన గవర్నర్ గా కొనసాగిన కాలంలో ప్రభుత్వం అందించే జీతాన్ని తీసుకోకుండా ఆ జీతం డబ్బులను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకి వినియోగించాలంటూ తిరిగి ఇచ్చేసేవాడు. దీంతో పలువురు ఆర్నాల్డ్ చేస్తున్నటువంటి ఈ సేవలను గుర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అంతేగాక ఆర్నాల్డ్ రియల్ హీరో అని కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడంలో ఆర్నాల్డ్ ఎప్పుడూ ముందుంటారని ఇది హర్షించదగ్గ విషయమని అభిప్రాయపడుతున్నారు.