ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య దాదాపుగా 20 లక్షలు ఉంది.ఈ సంఖ్య ఎంతకు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.
ఇక ఇండియాలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా కూడా కరోనా పాజిటివ్‌ల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.ఈ సమయంలో హాస్పిటల్స్‌ను రెడీగా ఉంచేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
కేసుల సంఖ్య వేలను దాటి లక్షలకు చేరితో హాస్పిటల్స్ సరిపోవు.ప్రస్తుతం అమెరికాలో అదే పరిస్థితి ఉంది.
అమెరికాలో ఏర్పడిన పరిస్థితుల్లో కనీసం సగం అయినా ఇండియాలో ఏర్పడితే హాస్పిటల్స్ బెడ్స్ సరిపోవు అనే వాదన చాలా మందిలో వినిపిస్తుంది.లాక్ డౌన్ అమలు జరుగుతున్నా కూడా వేలల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్‌ను రెడీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున బెడ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో హాస్పిటల్‌లో వాడే బెడ్ ను అతి తక్కువ ఖర్చుతే పోర్టబుల్‌గా తయారు చేసుకునే విధంగా ఒక కంపెనీ తయారు చేసింది.
కార్ట్ బోర్డ్ అదేనండి మనం అట్టాలు అంటాం కదా.అవే కాస్త మందంగా ఉండే అట్టాలు ఇప్పుడు మంచం తయారీకి ఉపయోగిస్తున్నారు.ఒక మనిషి సింపుల్‌గా ఒక్క చేతితో ఎత్తేయగల ఈ మంచంపై మూడు నాలుగు క్వింటాళ్ల బరువు వేయవచ్చు. నీళ్లు పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.
చాలా సింపుల్‌గా అసెంబుల్ చేసుకోవడంతో పాటు అత్యంత సులభ రీతిలో దీన్ని తయారు చేసుకోవచ్చు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బెడ్స్ మన దేశానికే కాదు ప్రపంచ దేశాలన్నింటికి కూడా చాలా కీలకం.కేసులు వేలు దాటి లక్షల్లో పడితే ఎక్కడ కూడా మంచాలు ఉండవు. కనుక ఇలాంటి బెడ్స్‌ను తయారు చేసుకోవడం మంచిది.ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో. మీరు ఒకసారి చూడండి.