నడుమందం ఇలియానా తనను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం అంటోంది.అందుకే తనకి సినిమా ఇండస్ట్రీలో అఫైర్స్ లేవు అంటోంది.ప్రస్తుతం సినిమాలు లేక ఖాలిగా ఉన్న ఇలియానా ఫోటోషూట్స్ , ఇంటర్వ్యులతో కాలం వెళ్ళదీస్తోంది.
” నన్ను ఒక మగవాడు ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టం.నేనెవరికి అంత ఈజీగా పడిపోను.నాకు చాలా ఆలోచనలు, అంచనాలు ఉన్నాయి.వాటన్నిటిని అందుకోవడం ఏ మగాడికైనా చాలా కష్టం.నాకు డ్రెస్సింగ్ బాగుండాలి, అబ్బాయి చూడడానికి బాగుండాలి, బలంగా, కండల దేహం అయ్యుండాలి, బాగా నవ్వించాలి, బుద్ధిమంతుడు, తెలివిమంతుడు, నన్ను బాగా ఇష్టపడే వాడు అయ్యుండాలి.
ఇన్ని లక్షణాలు ఒక్కడిలో దొరకడం కష్టం.అందుకే నాకు ఇండస్ట్రీలో ఎవరిపై కుడా ఇష్టం ఏర్పడలేదు.
నేను ఫలానా హీరోతో ప్రేమలో పడ్డాననే వార్తలు కుడా పెద్దగా రాలేదు” అంటూ నవ్వేసింది ఇల్లి బేబి.
రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి “”తని ఒరువన్” రీమేక్లో ఇలియానాను అనుకుంటున్నారు అనే వార్తలు గత రెండు వారాలుగా వస్తున్న సంగతి తెలిసిందే.
మళ్ళి ఇలియానా నడుమందాలు తెలుగు ప్రేక్షకులని గిలిగింతలు పెట్టాలని ఆశిద్దాం.