కామేడియన్ ఆలీ మాటల వివాదం రోజురోజుకి పెద్దదవుతోంది.ఓసారి యాంకర్ బట్టల మీద, ఓసారి సమంత బొడ్డు మీద, తాజాగా అనుష్క తొడల మీద ఆలీ చేసిన వాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
మహిళా సంఘాలు, కొందరు సామాజికవేత్తలు ఆలీ వాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని , ఆలీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.ఇవన్ని ఒక ఎత్తైతే, యుట్యుబ్ లో ఆలీ పై వ్యక్తిగత విమర్శలు చేసారు కొందరు అమ్మాయిలు.
మరి ముఖ్యంగా అన్నపూర్ణ సుంకర అనే అమ్మాయి ఆలీని పట్టుకొని దున్నపోతు, మనిషివేనా లాంటి పదజాలంతో దూశిస్తునే ఉంది.ఈ విషయంపై ఆలీ గుర్రుగా ఉన్నాడట.
ఇకపై ఆడియో ఫంక్షన్స్ లో ఎలాంటి అనుచిత వాఖ్యలు చేయకూడదు అని ఆలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అలాగే తనపై వ్యక్తిగత దూషణ కు దిగినవారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆలీ అనుకున్నట్లు ఫిలింనగర్ సమాచారం.
కుదిరితే పరువు నష్టం దావా వేసి ఆన్ లైన్ అల్లరిమూకలకు బుద్ధి చెప్పాలని ఆలీ నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతా చల్లబడిపోయింది, ఇక ఆలీ వలన ఎలాంటి గొడవలు ఉండవు అని అనుకుంటున్నా తరుణంలో ఇలాంటి వార్తలు చర్చనీయాంశం అయ్యాయి.