ప్రేక్షకులకి, అభిమానులకి మాత్రమే ఆయన సూపర్ స్టార్.ఇంట్లో అడుగు పెడితే ఒక మామూలు మగాడే.
భార్య, ఇద్దరు పిల్లలు , ఇదే ఆయన ప్రపంచం.అందుకే ఈ మాత్రం విశ్రాంతి దొరికినా, తన కుటుంబాన్ని తీసుకొని విదేశాలకు వెళ్ళడం మహేష్ బాబు కి అలవాటు.
అక్కడైతే ఎవరు డిస్టర్బ్ చేయరని మహేష్ అలా చేస్తూ ఉంటారు.
ఈ దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు సూపర్ స్టార్.
ఇప్పటికే కొట్లలో ఖర్చు చేసే కొత్త రేంజ్ రోవర్ కారు ఇంటికి తెచ్చిన మహేష్, నిన్నటి రోజంతా ఫ్యామిలితోనే గడిపారు.కుమారుడు గౌతమ్, గారాలపట్టి సితార ఘట్టమనేనితో టపాసులు పేల్చుతూ సందడి చేసారు.
బ్రహ్మోత్సవం షెడ్యుల్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది.దీపావళి పండగను కుటుంబంతో కలిసి జరుపుకోవాలని షూటింగ్ నుంచి సెలవు తీసుకున్నారు మహేష్.
రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటారు.