ప్రస్తుత కాలంలో కొందరు చేసేటటువంటి పనులను చూస్తుంటే హృదయ విదారకం కలగక మానదు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య తెల్లగా లేదని దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని మియాపూర్ పరిసర ప్రాంతంలో యోగి అనే వ్యక్తి తన భార్య, కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో తన అక్క కూతురు ని పెళ్లి చేసుకున్నాడు.అయితే ఆమె కొంతమేర నలుపు రంగులో ఉండడంతో యోగికి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
దీనికితోడు అంతకు ముందే యోగి వేరే యువతిని ప్రేమించడంతో అతడి కుటుంబ సభ్యులు ఇష్టం లేని పెళ్లి చేశారు.
మొదట్లో తన కుటుంబ సభ్యుల కోసం తన మేనకోడలు మెడలో తాళి కట్టినప్పటికీ ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలబడలేదు.
ఈ క్రమంలో కాపురంలో మనస్పర్ధలు, విభేదాలు, కలహాలు వచ్చాయి. దీంతో తాజాగా ఈ విషయంపై యోగి మరియు అతడి భార్య గొడవ పడ్డారు.ఈ గొడవలో విచక్షణ కోల్పోయినటువంటి యోగి తన భార్యను దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు.అనంతరం భయపడి తాను కూడా కత్తితో బలంగా గాయపరచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే యోగిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యోగి భార్య మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.