మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్.. ఫ్యాన్స్ గర్వించేలా మరో అత్యున్నమైన ఘనతను సొంతం చేసుకోవడంతో?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటనకు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ఇప్పటికే ఎన్నో అవార్డులను, అరుదైన ఘనతలను సొంతం చేసుకున్న చిరంజీవి మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు.

గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగా మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ ( Padmavibhushan )వరించింది.సినీ అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం వల్లే చిరంజీవి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంటున్నారు.1978 సంవత్సరంలో సినీ కెరీర్ ను మొదలుపెట్టిన చిరంజీవి అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ తన నటన, డ్యాన్స్, డైలాగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఎలాంటి రోల్ లో నటించినా ఆ రోల్ లో తన ప్రత్యేకతను చాటుకుంటూ చిరంజీవి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంటున్నారు.

చిరంజీవి సినిమాలు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందుకున్నాయి.

2006 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డ్ ను ఇవ్వగా ఇప్పుడు చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది.ఉత్తమ నటుడిగా చిరంజీవి ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులతో ( Filmfare Awards )పాటు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.1987లో సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం గమనార్హం.

Advertisement

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర( visvambara ) సినిమాలో నటిస్తుండగా మల్లిడి వశిష్ట 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా వేరే లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.చిరంజీవి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటానని నమ్ముతున్నారు.

స్టార్ హీరో చిరంజీవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు