మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజ డైరక్షన్ లో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా సల్మాన్ ఖాన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ఈ నెల నుంచే స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.ఇక ఈ నెల చివర్లో జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది.
గాడ్ ఫాదర్ సినిమా ఈవెంట్ కి పవన్ వస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.గాడ్ ఫాదర్ సినిమాలో చిరు స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది.
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు.మరోపక్క మెహర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ కూడా సెట్స్ మీద ఉంది.