రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకో నున్నారు.ఈయన బర్త్ డే అంటే మెగా ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ పుట్టిన రోజు హంగామా స్టార్ట్ అయ్యింది.ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా కొన్ని సేవ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారు.
ఇక ఇది పక్కన పెడితే చిరు నటించే సినిమాల అప్డేట్ ల గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరో రేపు పుట్టిన రోజు అయినా ఈ రోజు నుండే ఈయన సినిమాల నుండి మేకర్స్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం స్టార్ట్ చేసారు.
కొద్దీ సేపటి క్రితమే మెగాస్టార్ భోళా శంకర్ నుండి ఒక అప్డేట్ ఇచ్చారు.ఇప్పటికే గాడ్ ఫాథర్ నుండి టీజర్ ఈ రోజు సాయంత్రమే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇక ఇప్పుడు భోళా శంకర్ టీమ్ ఈయన పుట్టిన రోజు కానుకగా రిలీజ్ డేట్ ప్రకటించారు.చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ పోస్టర్ లో మెగాస్టార్ మంచి స్వాగ్ తో పాటు స్టైలిష్ గా బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు కనిపిస్తున్నారు.ఇది మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అనే చెప్పాలి.
ఇక ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.