జులై 22న 'మీలో ఒకడు' చిత్రం గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ మ‌రో ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్టు మూవీ రాబోతోంది.శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”.

 Meelo Okadu Movie Grand Release On July 22 Details, Meelo Okadu Movie, Grand Rel-TeluguStop.com

సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.సీనియ‌ర్ న‌టులు కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్, సాధన పవన్ న‌టించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A స‌ర్టిఫికేట్ సొంతం చేసుకుంది.

సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని జులై 22న స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.కాగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ అధ్య‌క్షులు కొల్లి రామకృష్ణ, నిర్మాత మండ‌లి సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్, దైవజ్ఞ శ‌ర్మ‌, న‌టులు అశోక్ కుమార్, స‌మీర్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావుతో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ, వ్యాపార ప్ర‌ముఖులు పాల్గోని చిత్ర‌యూనిట్ ను అభినందించి శుబాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… 24 క్రాప్ట్స్ పై నాకు అవగాహ‌న లేదు.కానీ మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు… డీ గ్లామ‌ర్ గా ఉన్న న‌న్ను డీఓపీ పి.శ్రీను అందంగా చూపిస్తే… డైలాగ్ రైట‌ర్ ధ‌ర‌ణికోట శివ‌రాం ప్ర‌సాద్ గారు మంచి డైలాగ్స్ రాసి సినిమా కు బ‌లం చేకూర్చారు… ఓ స్టార్ న‌టుడు కి కంపోజ్ చేసే.ఫైట్స్ నాకు కూడా హంగామా కృష్ణ గారు కంపోజ్ చేశారు.

సీనియ‌ర్ న‌టులు సుమ‌న్, కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్లే ఇంత మంచి అవుట్ పుట్ వ‌చ్చింద‌ని అన్నారు.చిరంజీవి, బాల‌కృష్ణ,వెంక‌టేష్, నాగార్జున, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌రెంతో మంది హీరోల ఇన్సిపిరేష‌న్ తో హీరో కావాలని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని అన్నారు.

ప‌దేళ్ల క్రిత‌మే క‌థ రెడీ చేసుకున్నాన‌ని… అన్ని స‌మ‌కూర్చుకోని స‌క్సెస్ ఫుల్ గా సినిమా పూర్తి చెయ్య‌గ‌లిగాని తెలిపారు.నా కుటుంబ స‌భ్యుల స‌పోర్ట్ తో ఇక్క‌డిదాకా రాగ‌లిగాన‌ని అన్నారు.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వ‌చ్చి మా టీమ్ ను ఆశీర్వ‌దించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.ఈ నెల 22 రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాల‌ని కోరారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షులు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.హీరో, నిర్మాత, ద‌ర్శ‌కుడు కుప్పిలి శ్రీనివాస్ కొత్త‌వాడైన బాగా న‌టించడ‌మే కాకుండా డ్యాన్స్ లు కూడా బాగా చేశాడ‌ని ప్ర‌శంసించారు.

ఈ సినిమాకు ప‌ని చేసిన టెక్నిషియ‌న్స్ ప‌నితీరు బాగా ఉంది.ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌య‌సూర్య బొంపెం మంచి అవుట్ పుట్ ఇచ్చార‌ని అన్నారు.

జులై 22 న రిలీజ్ అవుతున్న మీలో ఒక‌డు సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరారు.తెలుగు చిత్ర నిర్మాత‌ల మండలి సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ… కుప్పిలి శ్రీనివాస్ ఇంటిరియ‌ర్, క‌న‌స్ట్ర‌క్ష‌న్ ఫీల్డ్ లో ఉంటున్నా.

సినిమా మీద ఇష్టంతో.హీరోగా, నిర్మాతగా, ద‌ర్శ‌కుడిగా అన్ని తానై మీలో ఒక‌డు రూపోందించ‌డం గొప్ప విష‌యం అన్నారు.

Telugu Suman, Grand July, Hrithika Singh, Meelo Okadu, Sadhana Pavan, Surya Bhag

ట్రైల‌ర్, సాంగ్స్ అవుట్ పుట్ బాగా ఉంద‌ని అన్నారు.కెమెరా మెన్ శ్రీను పిక్చ‌రైజేష‌న్ బాగా తీశార‌ని ప్ర‌శంసించారు.ఈ నెల 22 న రిలీజ్ అవుతున్న మీలో ఒక‌డు స‌క్సెస్ అయి, డ‌బ్బులు రావాల‌ని.కుప్పిలి శ్రీనివాస్ మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని ఆశీర్వ‌దించారు.నిర్మాత రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ… ఓ సినిమా నిర్మించ‌డం మాములు విష‌యం కాదు… ఓ నిర్మాతగా ఆ క‌ష్టాలు నాకు తెలుసు.కుప్పిలి శ్రీనివాస్ బ‌ల‌మైన సంక‌ల్పంతో ఈ సినిమాను పూర్తి చేశారు.

కొత్త వాళ్ల‌ను ఆద‌రిస్తే.మ‌రిన్ని సినిమాలు వ‌స్తాయి.

న‌టుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.ఓ సినిమా చేయ‌డం య‌జ్ఞం.ఇండ‌స్ట్రీకి సంబంధం లేని కుప్పిలి శ్రీనివాస్ వ‌చ్చి పూర్తి చేయ‌డం ప్రశంసించ‌ద‌గ్గ విష‌యం అన్నారు.ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 200 సినీ కుటుంబాల‌కు 40 రోజుల పాటు అన్నం పెట్ట‌డం గొప్ప విష‌యం అన్నారు.

మీలో ఒకడు స‌క్సెస్ అయి….కుప్పిలి శ్రీనివాస్ మ‌రిన్ని సినిమాలు తీయాల‌ని కోరారు.

న‌టుడు స‌మీర్ మాట్లాడుతూ … మీలో ఒక‌డు చిత్రంలో మంచి క్యారెక్ట‌ర్ చేశాన‌ని అన్నారు.కుప్పిలి శ్రీనివాస్ కొత్త‌వాడైన సినిమాను ఫ‌ర్పెక్ట్ గా హ్యాండిల్ చేశార‌ని అన్నారు.

ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాల‌ని కోరారు.న‌టుడు బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు… కుప్పిలి శ్రీనివాస్ క‌మిటెమెంట్ మొద‌టి నుంచి గ‌మ‌నిస్తు న్నాను.

ఎంతో ఫ్యాష‌న్ గా ఈ సినిమాను తీశారు.ప్ర‌తి చిన్న‌విష‌యంలో కేర్ తీసుకుని.

పైన‌ల్ గా మంచి అవుట్ పుట్ రాబ‌ట్టుకోగ‌లిగారు.ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని.ఈ నెల 22 న థియేట‌ర్ ల‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్ర‌తిఒక్క‌రు ఆద‌రించాల‌ని కోరారు… వీరితో పాటు చిత్ర‌యూనిట్ స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

న‌టీనటులు:

లయన్ కుప్పిలి శ్రీనివాస్ (హీరో), హ్రితిక సింగ్, సాధన పవన్ (హీరోయిన్స్).
నిర్మాణం: లయన్ కుప్పిలి వీరాచారి, స‌మ‌ర్ప‌ణ: శ్రీమ‌తి చిన్ని కుప్పిలి, కథ, ఐడియా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కుప్పిలి శ్రీనివాస్, రచయిత: ధ‌ర‌ణికోట శివ‌రాంప్ర‌సాద్ , పర్యవేక్షణ: కె.ప్రశాంత్, మ్యూజిక్ డైరెక్టర్ : జ‌య‌సూర్య బొంపెం, కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్, డి.ఓ.పి: పి.శ్రీను, ఫైట్స్: హంగామా కృష్ణ, పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, జై సూర్య, సింగర్స్: సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు, ఎడిటర్: ప్రణీత, ఎన్టీఆర్, పీ.ఆర్.ఓ: అశోక్ ద‌య్యాల‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube