మేడారం స్పెషల్‌ : కుక్కకు నిలువెత్తు బంగారం

తెలంగాణలోనే కాకుండా సౌత్‌ ఇండియాలోనే అతి పెద్ద జాతరగా పేరు దక్కించుకున్న మేడారం సమ్మక సారలమ్మ జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది.అధికారికంగా మరికొన్ని గంటలు పట్టబోతుంది.

 Medaram Sammaka And Sarakka Special Update-TeluguStop.com

కాని గత నెల రోజులుగా జాతర సాగుతూనే ఉంది.సమ్మక సారలమ్మ గద్దెల వద్ద క్వింటాల్ల బంగారం(బెల్లం) ను భక్తులు సమర్పిస్తూనే ఉన్నారు.

పిల్లలకు పెద్దలకు మొక్కులు మొక్కుకుంటూ నిలువెత్తు బంగారంను ఇస్తున్నారు.ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరితే నిలువెత్తు బంగారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.

నిన్న మేడారంలో ఒక జంట తాము పెంచుకుంటున్న కుక్క తప్పి పోవడంతో ఆ కుక్క దొరకాలని మొక్కుకున్నారట.మొక్కుకున్న ఒక్క రోజులోనే కుక్క దొరికింది.దాంతో ఇప్పుడు ఆ కుక్కకు నిలువెత్తు బంగారం తూచి సమ్మక సారలమ్మలకు ఇచ్చారు.ఇప్పటి వరకు నిలువెత్తు బంగారం మనుషులకే ఇచ్చారు.

మొదటి సారి ఒక జంతువుకు నిలువెత్తు బంగారం ఇవ్వడం జరిగిందంటూ స్థానికులు చెబుతున్నారు.ఇక జాతర విషయానికి వస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది.

ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోయేలా ఏర్పాట్లు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube