ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జనాలు ఓటేసేందుకు వణికిపోతున్నారు.కొంటా, బీజాపూర్, దంతెవాడ నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా మారింది.
ఎన్నికలను బహిష్కరించాలంటూ… మావోయిస్టు లు పిలుపునిచ్చారు.ఎవరైనా తమ కళ్లు గప్పి ఓటు వేయాలని చూశారో.
వారి చేతికి ఉన్న ఇంకు ఆధారంగా వేళ్లు నరికివేస్తామని హెచ్చరికలు జారీచేశారు.ప్రాణాలు కూడా తీసేందుకు వెనుకాడమని మావోలు పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుచేశారు.
2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టులు ఇలాంటి హెచ్చరికలనే జారీ చేశారు.దీంతో మూడు నియోజకవర్గాల్లోని 59 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ శాతం సున్నాగా నమోదైంది.మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన బస్తర్ లో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి.తొలి దశలో భాగంగా అక్కడ ఈ నెల 12న పోలింగ్ జరగబోతోంది.