తెలంగాణాలో అనూహ్యంగా మహాకూటమికి మద్దతు పెరుగుతోంది.టీఆరఎస్ పార్టీని వ్యతిరేకించేవారంతా ఏకమై టీఆర్ఎస్ కి అధికారం దక్కకుండా చెయ్యాలని చూస్తున్నారు.
ఇప్పటికే … కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐతో ఏర్పాటైన మహాకూటమిలో తాజాగా మరో పార్టీ చేరింది.మహాకూటమికి మద్దతు ఇస్తున్నట్టు గా ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ ప్రకటించింది.

బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘని ఆరోపించారు.సీఎం కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, ఇచ్చిన హామీలకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు.రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.అందుకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వకూడదని, మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.







