మన హిందూ పురాణాల్లో గోమాతకి చాలా ప్రాముఖ్యత కలదు.అంతేకాకుండా అవునుండి వచ్చిన పాలనుండి మనదగ్గర అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయి.
అలాగే అవునుండి వచ్చిన వ్యర్ధాలైన యూరిన్, పేడ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.గో పంచితం అంటే గోవు యూరిన్ ఒక సర్వరోగ నివారిణి అని అంటూ వుంటారు.
ఆవు పేడను మాత్రం ప్రకృతి సేద్యంలో విరివిగా వాడుతున్నారు.అయితే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన కార్ల ద్వాారా వెలువడే కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి వివిధ పరిశోధనలు చేస్తుంది.
ఈ నేపథ్యంలో ఆవుపేడ ద్వారా కార్ల నుంచి వెలువడే CO2 తగ్గించడానికి బయోగ్యాస్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు నివేదిస్తున్నాయి.ముఖ్యంగా బయోగ్యాస్, ఇథనాల్ ద్వారా నడిచే వాహనాలకు ఈ పరిశోధనలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.మారుతీ సుజుకీ తన భవిష్యత్ వాహనాలైన ఈవీలపైనే తన దృష్టి పెట్టకుండా సీఎన్ జీ, ఇథనాల్, మిశ్రమ ఇందనాల ద్వారా కార్బన్ న్యూట్రల్ అంతర్గత దహన ఇంజిన్ వాహనాలను అందించేందుకు కృషి చేస్తుంది.
దీని కోసం ముఖ్యంగా బయోగ్యాస్ ఉత్పత్తిపై ఇపుడు మారుతి సుజికి కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది.ఎందుకంటే, భారత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో దొరికే ఆవుపేడ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం చాలా తేలికని కంపెనీ భావిస్తుంది.ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సీఎన్ జీ వాహనాల్లో 70 శాతం వాహనాలు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినవని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
కేవలం బయోగ్యాస్ ఉత్పత్తి భారత్ కే పరిమితం చేయకుండా భవిష్యత్ లో ఆఫ్రికన్, ఇతర ఆసియా దేశాల్లోని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.