రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధిత విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
స్కూల్ బస్సు ఘటన తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు.
అనంతరం గాయపడ్డ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.