ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు మీద వ్యామోహంతో ప్రేమ, పెళ్లి వంటి బంధాలని అపహాస్యం చేస్తున్నారు.కాగా తాజాగా ఓ యువతి డబ్బు కోసం పెళ్లి కూతురుగా మారిన పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత డబ్బు, నగలతో పాటు ఉడాయిస్తున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పుట్టి వివరాల్లోకి వెళితే సునీల్ కుమార్ అనే వ్యక్తి స్థానిక రాష్ట్రంలోని తిరుపతి పరిసర ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు కుటుంబం పోషణ నిమితమై స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇటీవలే ఇదే సంస్థలో పనిచేస్తున్న సుహాసిని అనే యువతితో పరిచయం ఏర్పడింది.అయితే ఈ పరిచయం కాస్త అతి కొద్ది సమయంలోనే ప్రేమగా మారింది.
దీంతో సునీల్ కుమార్ తన తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.అయితే అప్పటి వరకూ ప్రేమ మైకంలో ఉన్న సునీల్ కుమార్ తన భార్య గురించి ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు.
కానీ పెళ్లయిన తర్వాత తన భార్య అసలు రంగు బయట పడటంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే పెళ్లయిన తర్వాత సుహాసిని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.అంతేగాక నిత్యం సునీల్ కుమార్ ని డబ్బు కోసం వేధించేది.ఈ క్రమంలో సునీల్ కుమార్ దాదాపుగా ఆరు లక్షల రూపాయలకు పైగా తన భార్యకు ఇచ్చినట్లు సమాచారం.
కాగా ఇటీవలే ఈ డబ్బు ని సునీల్ కుమార్ తల్లిదండ్రులు తిరిగి ఇవ్వాలని సుహాసిని ని అడగడంతో ఫోన్ స్విచాఫ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.దీంతో సునీల్ కుమార్ తన భార్య కోసం ఎంత వెతికినా ఆచూకీ మాత్రం తెలియలేదు.
దాంతో సునీల్ కుమార్ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాడు.
సునీల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సుహాసినికి ఇదివరకే పలువురు వ్యక్తులతో పెళ్లి అయినట్లు మరియు పెళ్లయిన తర్వాత సుహాసిని డబ్బు, పత్రాలతో ఉడాయిస్తున్నట్లు కనుగొన్నారు.
దీంతో సునీల్ కుమార్ మరియు అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.అంతేగాక ఎలాగైనా తమ డబ్బు, బంగారం నగలను తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను కోరుతున్నారు.