దారుణం : భార్యకి అబార్షన్ అవుతుందని భర్త ఏకంగా క్షుద్ర పూజ చేస్తూ...

ఈమధ్య కాలంలో కొందరు మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలపై ఉన్నటువంటి విశ్వాసం కారణంగా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి భార్య కి తరచూ గర్భస్రావం అవుతుందని క్షుద్ర పూజ చేసి అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా హతమార్చిన ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Man Kidnap Small Girl And Killed For Black Magics In Bihar State, Bihar-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ముంగేర్ పరిసర ప్రాంతంలో “దిలీప్ కుమార్” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే గత కొన్ని సంవత్సరాలుగా దిలీప్ కుమార్ భార్య గర్భం దాల్చినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల తరుచూ గర్భస్రావం అవుతుంది.

దీంతో దిలీప్ కుమార్ దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులను సంప్రదించకుండా స్థానికంగా ఉన్న మాంత్రికుడిని సంప్రదించాడు.దీంతో ఆ మాంత్రికుడు ఏకంగా దిలీప్ కుమార్ భార్య కి సంతాన దోషం ఉందని ఆ దోషం తొలగిపోవాలంటే 10 సంవత్సరాలు నిండిన బాలిక రక్తం మరియు కళ్ళ ను తీసుకొచ్చి పూజ చేస్తే సంతాన దోషం తొలగిపోతుందని మళ్లీ ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని మాయ మాటలు చెప్పాడు.

Telugu Bihar, Black Magic, Marriedkidnap, Small Kidnap-Telugu Crime News(క్�

దీంతో దిలీప్ కుమార్ మాంత్రికుడి మాటలు నమ్మి స్థానిక ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామంలో చిన్నారి ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి ఆమె రక్తం మరియు కళ్ళతో పూజ చేశాడు.

అనంతరం మృత దేహాన్ని ముళ్ల పొదల్లో విసిరేశారు.దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.అనంతరం మృత దేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించగా బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా బోరున విలపించారు.

అంతేకాక తమ కూతురుని క్షుద్ర పూజల పేరుతో దారుణంగా హతమార్చిన దిలీప్ కుమార్ ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube