తెలంగాణ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు.బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు.
కేంద్ర మంత్రి శర్బానంద్ సోనోవాల్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అంతం ప్రారంభమైందని అన్నారు.
టీఆర్ఎస్ ను ఎదుర్కొవడం కాంగ్రెస్ వల్ల కాదని, అందుకే మర్రి బీజేపీలో చేరారని తెలిపారు.మర్రి శశిధర్ రెడ్డ చేరికతో తెలంగాణలో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆయన వ్యాఖ్యనించారు.
అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లేనని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.
ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.