గాయాల పాలైన మంచు విష్ణు.. కారణం అదేనట!

మంచు విష్ణు..

 Manchu Vishnu Injured jinnah movie Shooting , Manchu Vishnu Injured, manchu V-TeluguStop.com

ఈయన గత కొన్ని రోజులుగా సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడి పోతున్నాడు.మంచు కాంపౌండ్ సినిమాల పరంగా వెనకనే ఉన్నారు.

సినిమాలు చేస్తున్న సరైన సక్సెస్ అయితే రావడం లేదు.దీంతో ప్రేక్షకులు మంచు హీరోలను మర్చిపోతున్నారు.

మంచు విష్ణు చివరగా మోసగాళ్లు సినిమాతో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.

ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో ఈయన ఢీలా పడిపోయాడు.

అందుకే ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు.ఈసారి అయినా ప్లాప్ కాకుండా విజయం అందుకోవాలని మంచు విష్ణు చాలా కష్ట పడుతున్నాడు.

ఈ క్రంమలోనే ఈయన ప్రెజెంట్ జిన్నా సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని విష్ణు ముందు నుండే ఈ సినిమా కోసం భారీ ప్రొమోషన్స్ చేస్తున్నాడు.

ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నాడు.ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటు మరొక హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.అయితే తాజాగా ఈ షూటింగ్ లో మంచు విష్ణు గాయపడినట్టు తెలుస్తుంది.

Telugu Vm, Ishaan Surya, Jinnah, Manchu Vishnu, Manchuvishnu, Payal Rajput, Sunn

ఈ విషయాన్నీ విష్ణు స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.ఈ సినిమా షూట్ లో తాను డ్యాన్స్ చేస్తుండగా గాయాలు అయినట్టు.ఈ గాయం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ స్టెప్స్ కారణంగా అయ్యిందని.ఈ గాయాన్ని కూడా తాను ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

మరో రెండు వారాలు రెస్ట్ తీసుకోనున్నట్టు తెలిపాడు.

ఇక మంచు విష్ణు 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా కోన వెంకట్ ఈ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటెర్టాన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube