కొందరు పేరు చెప్పి.కొందరు పేరు చెప్పకుండా మంచు హీరో విష్ణు ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఆయన గత చిత్రం దాదాపుగా 40 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందట.అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా ఇప్పడు జిన్నా అనే సినిమాను చేస్తూ ఉన్నాడు.
సినిమా ను తెలుగులో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అంటే పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.జిన్నా సినిమా టైటిల్ విషయంలో విమర్శలు వచ్చాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా.మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా ఏంట్రా బాబు అంటూ కొందరు ట్రోల్ చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను అన్నట్లుగా మంచు విష్ణు జిన్నా ను పెంచుకుంటూ పోతున్నాడు.
తాజాగా సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.ఫస్ట్ లుక్ లో జిన్నా గా మంచు విష్ణు పక్కా మాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు.
ఈ సినిమా తో ఆయన పై ట్రోల్స్ మరింతగా పెరుగుతాయేమో అంటో కామెంట్స్ వస్తున్నాయి.గతంలో సన్నాఫ్ ఇండియా సినిమా ను ఈయన నిర్మించాడు.
ఆ సినిమా కనీసం యాబై లక్షలు వసూళ్లు చేయలేక పోయింది.ఒక వేళ జిన్నా కూడా అదే పరిస్థితిని చవి చూస్తే పరిస్థితి ఏంటీ అనేది ఆయనకు అర్థం అవ్వడం లేదు.
మంచు విష్ణు ఎంత గొప్పగా చేసినా కూడా సినిమా ను జనాలు ఏ మేరకు ఆధరిస్తారు అనేది ఇప్పుడు పెద్ద అనుమానంగా అయ్యింది.ఎందుకంటే ఆయన్ను ట్రోల్స్ చేసే వారు మరీ తక్కువ చేసి చూపించారు.
అందుకే ఇప్పుడు ఆయన సినిమా లు చూసేందుకు ఆసక్తి ని కనబర్చుతున్న వారు తక్కువ అయ్యారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మరి జిన్నా పరిస్థితి ఏంటో చూడాలి.
జిన్నా సినిమా ను సొంతంగానే భారీ బడ్జెట్ తో నిర్మించాడు.పాయల్ రాజ్ పూత్ మరియు సన్నీ లియోన్ ను ను ఈ సినిమా లో నటింపజేశారు.
సన్నీ లియోన్ వల్ల ఇది పాన్ ఇండియా సినిమా అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.