Manchu Manoj Bhuma Mounika : బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన భూమా మౌనిక..నా ప్రాణం నువ్వే అంటూ మనోజ్ పోస్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj) ఒకరు.గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి మనోజ్ ఇటీవల కాలంలో తిరిగి ఇండస్ట్రీలో ఎంతో బిజీ అయ్యారు.

 Manchu Manoj Wife Bhuma Mounika Shares Baby Bump Photos-TeluguStop.com

ఈయన ఒకవైపు వెండితెర సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈయన గత ఏడాది భూమా మౌనిక రెడ్డి ( Bhuma Mounika Reddy )ని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరి వివాహం మంచు లక్ష్మీ నివాసంలో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇక వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా బిజీ అయ్యారు.ఇకపోతే గత ఏడాది డిసెంబర్ నెలలో మనోజ్ శుభవార్తను తెలిపారు తాను తండ్రి కాబోతున్నాను అనే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఇటీవల కాలంలో భూమా మౌనిక తన బేబీ బంప్ (Baby Bump)తోనే బయటకు వస్తూ సందడి చేస్తున్నారు.ఎక్కడికి వెళ్లినా మనోజ్ మౌనిక ఇద్దరు కలిసి వెళ్తున్నారు.

ఇకపోతే తాజాగా మౌనిక బేబీ బంప్ ఫోటోషూట్ చేయించారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను మౌనిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈమె తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ చేయించారు.ఇక ఈ ఫోటోలు షేర్ చేసిన ఈమె నా చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడు నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తూ ఉంటారు అంటూ తన భర్త మనోజ్ తో పాటు తన కుమారుడు ధైరవ్ ను ట్యాగ్ చేశారు.

ఇక ఈ ఫోటోలపై మంచు మనోజ్ స్పందిస్తూ…పిల్లా.ఓ పిల్ల నా ప్రాణం నువ్వేనంటూ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube