షోరూమ్‌లోకి వెళ్లి షూస్ ధరించాక ఈ వ్యక్తి పనికి ఉద్యోగి షాక్..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు.అవి ఒకేసారి ఫన్నీగా ఉంటాయి అలాగే బాధను కలిగిస్తాయి.

 Man Played Hilarious Prank On Employee In Shoe Store Video Viral Details, Viral-TeluguStop.com

కొందరైతే పబ్లిక్ లో ప్రాంక్ లు( Pranks ) చేస్తూ ఒత్తిడిలో ఉన్నవారికి ఊహించని షాక్ లు ఇస్తుంటారు.ఇవి పెద్ద హానికరంగా కనిపించవు కానీ కొంత సమయం పాటు వారిలో గుబులు రేపుతాయి.

తాజాగా ఈ కోవకు చెందిన ఒక వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.@NoContextHumans ట్విట్టర్ పేజీ షేర్ చేసిన దీనికి ఇప్పటికే ఒక కోటి 80 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక షూ స్టోర్ రూమ్ లో కస్టమర్ కూర్చోవడం మనం చూడవచ్చు.అతడికి అక్కడే ఉన్న ఒక ఉద్యోగి షూ ట్రయల్( Shoes Trial ) ఇప్పించడంలో సహాయం చేస్తున్నాడు.

ఆ ఉద్యోగి చేతిలో షూలు ఉండటం మనం గమనించవచ్చు.అతడు షూ అందించగా కస్టమర్( Customer ) వాటిని తొడుక్కున్నాడు.అనంతరం చాలా వేగంగా షోరూం బయటికి ఉరుకుతున్నట్లు పరుగు లంకించుకున్నాడు.ఇది చూసి వాటిని అతడికి అందించిన ఉద్యోగి షాక్ అయ్యాడు.

తాను ఇచ్చిన షూస్ వేసుకొని బిల్లు చెల్లించకుండా అతడు పారిపోతున్నాడేమో అని బాగా భయపడిపోయాడు.అంతేకాదు సదరు కస్టమర్ ని పట్టుకోడానికి అతడి వెంటే ఉరికాడు.అప్పుడే కస్టమర్ ఊహించని షాక్ ఇచ్చాడు.అతడు ఆ షూస్ రన్నింగ్( Running ) కోసం బాగుంటాయా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే అలా ఉరికాడు.

మళ్లీ తిరిగి షో రూమ్ లోకి వెళ్లడం చూసి ఉద్యోగి చాలా ఊపిరి పీల్చుకున్నాడు.

ఒక్క క్షణం పాటు గుండె ఆగిపోయేంత పని చేశావు భయ్యా అన్నట్లు అతడు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.ఈ దృశ్యాలను మరొక వ్యక్తి కెమెరా లో రికార్డ్ చేశాడు.బహుశా దగ్గర షూ స్టోర్ ఉద్యోగిపై ప్రాంక్ చేయాలని ఇలా చేసి ఉండొచ్చు.

కానీ ఉద్యోగి భయపడిపోయిన తీరు చూస్తుంటే చాలా జాలి వేసింది.అదే సమయంలో నువ్వు కూడా వచ్చింది.

ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.ఇలాంటి ఎంప్లాయిస్ ను ఆటపట్టించడం సబబు కాదని మరికొంతమంది పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube