వైరల్: తేనెటీగలను ఒంటికి కరిపించుకొని ఎలా ఊరేగుతున్నాడో చూడండి!

సోషల్ మీడియాలో( Social Media ) ఎన్నో అరుదైన, ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలు నెటిజన్లను బాగా మెప్పిస్తాయి.

 Man Carries An Entire Bee Colony On His Arm Video Viral Details, Honey Bees, Vir-TeluguStop.com

అందుకే అవి క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక కొన్ని వీడియోలు ఉంటాయి అవి చూడడానికి చాలా ఆశ్చర్యంగా, నమ్మరాని విధంగా ఉంటాయి.

అలాంటి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియో చూస్తే మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు అని చెప్పుకోవచ్చు.

ఈ వీడియో మీకు ఖచ్చితంగా చెమటలు పట్టిస్తుంది అనడంలో సందేహమే లేదు.కావాలంటే వీడియో చూడండి.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాలుడు తన ఎడమ చేతిపై ఏకంగా తేనేటీగల పుట్టనే పెట్టుకొని తిరుగుతుండడం చూడవచ్చు.అలా ఆ కుర్రాడు తేనెటీగలు ( Honey Bees ) కూడా మోసుకుంటూ వీధిలో నడుస్తున్న దృశ్యాలు చూసి స్థానికులతో పాటు నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు సమాచారం.మీడియా కథనాల ప్రకారం, ఈ బాలుడు తేనెటీగల పెంపకంతో తేనె వ్యాపారం చేస్తున్నాడు.అయితే తేనెటీగలు అతనికి ఇలా అంటుకోవడం నిజంగా షాకింగ్‌గా ఉంది.

ఎందుకంటే తేనెటీగలు కుడితే ఆ నొప్పి భరించటం చాలా కష్టం.కొన్ని కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు మనం చూస్తూ వున్నాం.కానీ, వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం యువకుడి ఎడమచేతిపై తేనెటీగలు తేనెతుట్టేనే ఏర్పాటు చేసుకోవడం చూడవచ్చు.

పైగా అతను పిడికిలి బిగించి నడుస్తుంటే.మిగిలిన తేనెటీగలు అతని చేతికి వేలాడుతున్నాయి.

విషయం ఏమంటే, ఈ తేనెటీగలు అతడు చేసిన ఒక గొప్ప ఉపాయంతో ఇలా అతని కంట్రోల్లోకి వచ్చాయని భోగట్టా.ఆ కుర్రాడు తన పిడికిలిలో రాణి తేనెటీగను( Queen Bee ) పెట్టుకోవడంతో తేనెటీగలు అతనిపై దాడి చేయకుండా ఉన్నాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube