మానవత్వం అనేది ఈ మధ్యకాలంలో మచ్చుకైనా కనిపించట్లేదు.మూడుపూటలా కడుపునిండా భోజనం పెట్టి నెల తిరిగే లోపల జీవితం ఇచ్చే ఆసాములకు కూడా వెన్నుపోటు పొడుస్తున్న రోజులివి.
అన్నం పెట్టిన యజమాని జీవితాన్ని అర్ధాంతరంగా వారిని చంపి, వారి దగ్గర ఉన్న సొమ్మును కాజేసి పారిపోతున్నారు కొంతమంది కిరాతకులు. అన్నం పెట్టిన విశ్వాసం అనేది కూడా లేకుండా వారి మరణాన్ని కోరుకుంటున్నారు కొందరు నరరూప రాక్షసులు.
ప్రస్తుత కాలంలో ఇంట్లో పనికి ఎవరిని పిలవాలన్న భయంతో యజమానులు వణికిపోతున్నారు.మనుషుల్లో మానవత్వం లేదని చెప్పడానికి ఈ సంఘటన సమాధానంగా చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళితే… పనిలో పెట్టుకున్న ఓ పనిమనిషి తన యజమానురాలైన వృద్ధురాలిని కిరాతకంగా చంపి 10 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది.ఇకపోతే ఈ సంఘటన హైదరాబాదులోని కాచిగూడ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కాచిగూడ ప్రాంతంలోని చప్పల్ బజార్ లో ఓ ఇంట్లో కమలమ్మ అనే వృద్ధురాలు నివసిస్తుంది.ఆమె కొడుకు హైదరాబాదులోని నాగోల్ ప్రాంతంలో ఉండడంతో ఆ ఇంట్లో ఆమె ఒక్కరే జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే కమలమ్మ బాగోగులు చూసుకోవడానికి ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ ఏజెన్సీని సంప్రదించగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ ను మూడు రోజుల క్రితం పని లో చేర్చుకున్నారు.
అయితే ఉదయం ఆదమరచి నిద్ర స్థితిలో ఉన్న కమలమ్మను ఇరుగుపొరుగువారు చూసి తట్టిలేపిన లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలికి పరిశీలించగా కమలమ్మ చేతికి ఉండాల్సిన బంగారు గాజులు, బీరువాలోని నెక్లెస్ అంతా కలుపుకుని మొత్తంగా పది తులాల బంగారు ఆభరణాలు, అలాగే రూ.5,000 నగదు కనిపించలేదు.ఇక మృతురాలి కమలమ్మ ముఖంపై దిండుతో అదిమి చంపేసినట్లు ఆనవాళ్ళు కనపడ్డాయి.దీంతో నగదు నగలతో పనిమనిషి లక్ష్మి పారిపోయి ఉంటుందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.