సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) నుండి నెక్స్ట్ రాబోతున్న మూవీ కోసం తెలుగు ఆడియెన్స్ మొత్తం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా కోసం ఆడియెన్స్ లో భారీ హైప్ నెలకొంది.
మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”( Guntur Karam ).
ఈ కాంబో ఇప్పటికే రెండుసార్లు వచ్చింది.అతడు, ఖలేజా వంటి రెండు డిఫరెంట్ సినిమాలతో అలరించిన ఈ కాంబో ముచ్చటగా మూడవసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరో నెల రోజుల్లో సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే షూట్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యినట్టే అని టాక్.మిగిలిన షూట్ మొత్తం ఈ నెలలోనే ఫినిష్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ తెలుస్తుంది.ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ గా నిలువగా సెకండ్ సింగిల్ కోసం అంత ఎదురు చూస్తున్నారు.
నిర్మాత నాగవంశీ( Producer Nagavamshi ) సెకండ్ సింగిల్( Guntur Karam Second Single) పై అప్డేట్ ఇచ్చారు.డిసెంబర్ 11న ఈ సినిమా నుండి రెండవ పాటను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.అంతేకాదు ఇది రొమాంటిక్ సింగిల్ అని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మరింతగా పెరిగి పోయింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల,( Sreeleela ) మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.