నువ్విలా స్నేహితుడా వంటి సినిమాల ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి మాధవీ లత (Madhavi Latha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ, సినిమాల పరంగా కాకపోయినా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు ఈమె చేసే వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున గుర్తింపు సంపాదించుకున్నారు.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచే ఈమె ఇప్పటికీ సింగిల్గానే ఉంటున్నారు.అయితే మాధవి లతా పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
తాజాగా ఈమె తన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇదివరకు తనకు పెళ్లి అంటే ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు కానీ తాను 2014వ సంవత్సరం నుంచి కృష్ణుడిని ఎంతగానో విశ్వసిస్తున్నారట.ఇలా కృష్ణుడిని బాగా ఆరాధించడంతో తనకు ఫ్రెండ్ గా మారిపోయాడని ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తనని ఆరాధించే వారికి మాత్రమే తెలుస్తుందని పలు సందర్భాలలో ఈమె చెప్పుకొచ్చారు.ఇక 2023వ సంవత్సరంలో కృష్ణుడు ( Krishnudu ) వస్తానని చెప్పారు.
అయితే ఈ విషయం అందరికీ కామెడీ అనిపించినా కూడా ఆ క్షణం నుంచే నాకు పెళ్లి పై చాలా ఆసక్తి కలిగిందని మాధవి లత తెలిపారు.
ఈ ఏడాదిలోనే కృష్ణుడు వస్తానని చెప్పాడు తన రాక కోసమే ఎదురుచూస్తున్నాను ఒకవేళ రాకపోయినా ఏదో ఒక రీసన్ ఉంటుందని ఈమె ఈ సందర్భంగా తన పెళ్లి ( Marriage ) గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమా కెరియర్ గురించి కూడా ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు తనకు సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.అయితే హీరోయిన్ పాత్రే కావాలి అనే నిబంధనలు ఏమీ లేవని తాను నటించే పాత్రకు ప్రాధాన్యత ఉంటే సినిమాలలో తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా మాధవీ లత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.