నెలరోజుల క్రితం బ్రిటన్ ప్రభుత్వం అన్ని దేశాల విద్యార్ధులకి వీసాల విషయంలో స్పెషల్ వీసాలని వర్తింప చేస్తూ తమ దేశాలకి వచ్చే వివిధ దేశాల విద్యార్ధులకి ఎన్నో సౌకర్యాలు కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ ఉత్తర్వులలో భారత విధ్యార్దులకి మాత్రం చోటు కలిపించలేదు.దాంతో భారత్ నుంచీ కూడా ఎన్నో వినతులు వెళ్ళాయి అయితే బ్రిటన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
దీంతో భారత విద్యార్ధులు ఎంతో నిరాసకి లోనయ్యారు అయితే
బ్రిటన్ ఈ విధ్యమైన నిర్ణయం తీసుకోవడంతో ఎంతో మంది బ్రిటన్ మేధావులు కూడా తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు.భారత విద్యార్ధుల ప్రతిభని మనం ఆడరించితే తప్పకుండా బ్రిటన్ అభివృద్దిలో భాగస్వాములు అవుతారు అని తెలిపారు అయినా వెనక్కి తగ్గలేదు అయితే తాజగా లండన్ మేయర్ బ్రిటన్ ప్రభుత్వానికి ఓ లేఖని రాశారు.
మీరు తీసుకున్న నిర్ణయాలు నేను సమర్దిస్తాను అయితే విద్యార్థి వీసాల దరఖాస్తు నిబంధనలను సరిచేస్తూ 25 దేశాలకు వాటిని వర్తింపజేస్తూ మీరు ఇచ్చిన ఆదేశాలని భారత విద్యార్ధులకి కూడా వర్తింప చేయండి లండన్ నగర్ మేయర్ సాదిఖ్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.
భారత విద్యార్థులంటే వివక్ష ఎందుకని ఆయన హోంమంత్రి సాదిక్ డేవిడ్‌కు రాసిన ఓ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.పదేళ్ల కాలంలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.భారత్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మెరుగుపడడానికి మన వైఖరిలో మార్పు రావాలి.మనం కొన్ని చర్యలు తీసుకోక తప్పదు అంటూ వ్యాఖ్యానించారు.