ఈ ప్రవాస దంపతులు..ఎంతో ఆదర్శవంతులు

మనం ప్రేమగా చూసుకునే వ్యక్తులు చనిపోతే ఆ బాధను మనం వర్ణించలేము కుటుంభంలో ని వ్యక్తులు మనకి దూరం అయినా సరే గుండె చెరువవుతుంది.అలాంటిది కన్నకొడుకు కళ్ళ ముందు చనిపోతే.తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే నిజంగా ఆ తల్లితండ్రులకి అంతకుమించి భాధ ఏదీ లేదు…అయితే అలాంటి సందర్భంలో కూడా ప్రవాస భారతీయ దంపతులు తమ కొడుకు అవయవాలని దానం చేయడానికి ముందుకు వచ్చి తమ ఉదార స్వభావాన్ని చూపించారు వివరాలలోకి వెళ్తే…

 Inspirable Gunturu Nri Family-TeluguStop.com

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన జనరల్‌ ఇన్సూరెన్స్‌ సర్వేయర్‌ పిన్నింటి వెంకటేశ్వర్లు, రత్తమ్మల కుమారుడు పిన్నింటి సురేష్ బాబు, కోడలు సుధ ఇద్దరూ ఉద్యోగ రీత్యా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు.ఆ ఇద్దరు దంపతులకు కుమార్తె రమ్య, కుమారుడు కరణ్‌ ఉన్నారు…వారిలో కరణ్ కి 14 ఏళ్ళ వయస్సు అయితే అమెరికాలోనే పుట్టిన కరణ్‌ కొంతకాలం చిలకలూరిపేటలోని తాతయ్య ఇంట్లో పెరిగాడు.

అయితే తమ కొడుకుని వదిలి ఉండలేక తమవద్దే ఉంచుకోవాలి అనుకున్న తల్లితండ్రులు అమెరికాలో తమ వద్ద ఉంచి చదివిస్తున్నారు.అయితే ఈ నెల 9న కరణ్‌కు బ్రెయిన్‌ స్ర్టోక్‌ రావడంతో తల్లిదండ్రులు అక్కడి ఆస్పత్రిలో చేర్చారు.

ఆరు రోజులపాటు మృత్యువుతో పోరాడిన కరణ్‌ చివరికి శనివారం బ్రెయిన్‌ డెడ్‌ తో మృతి చెందాడు….అవయవదానం చేస్తే తమ కొడుకుని 10 మందిలో చూసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో అంత భాదలోను తమ కుమారుడి అవయవాలని దానం చేశారు.

అమెరికాలో ఈ దంపతులు ఏంతో మందికి ఆదర్శం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube