2023లో జరిగే విషయాలపై ఆధునిక నోస్ట్రాడమస్ కీలక ప్రకటన.. ప్రజల్లో తీవ్ర ఆసక్తి..

నోస్ట్రాడమస్ పేరు వినగానే భవిష్యత్తు గురించి చెప్పే వారు అని ఎవరికైనా అర్థం అవుతోంది.ప్రస్తుతం ఉన్న ఆధునిక నోస్ట్రాడమస్ లేదా లివింగ్ నోస్ట్రాడమస్ పేరుతో అథోస్ సెలోమ్ అనే వ్యక్తి కూడా బాగా ఫేమస్ అయ్యాడు.

 Living Nostradamus Athos Salome 2023 Predictions Details, Nostradamus, 2023 Year-TeluguStop.com

ఎంతంటే ఎన్నో కీలక విషయాలను అతడు ముందుగానే ఊహించి చెప్పాడు.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుందని అతడు ముందుగానే చెప్పాడు.

అంతేకాకుండా బ్రిటన్ రాణి మరణం, కరోనా వంటి వాటి గురించి ఆధునిక నోస్ట్రాడమస్ తెలిపాడు.ఇక అంతేకాకుండా 2023లో జరగబోయే కీలక విషయాలను అతడు ఊహించి తెలియజేశాడు.

వాటిపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది.దీనికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.

అమెరికాలోని నెవాడా ప్రాంతంలో 23 లక్షల ఎకరాలలో ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది.అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ స్పష్టత లేదు.ఆ ప్రాంతంలో ఏరియా 51లో అండర్‌గ్రౌండ్ పోర్టల్ తెరవబడుతుందని ఆధునిక నోస్ట్రాడమస్ తెలిపాడు.యునైటెడ్ స్టేట్స్ ఎడారిలో ఏరియా 51లో అండర్‌గ్రౌండ్ పోర్టల్ గురించి ఉపగ్రహ చిత్రాలు చిన్నపాటి ఎయిర్‌స్ట్రిప్‌ల నెట్‌వర్క్‌ను తెలిపాయి.ఇది 12 వేల అడుగుల వరకు విస్తరించి ఉంది.దీనిపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.

అక్కడ గ్రహాంతర వాసులతో కలిసి అమెరికా ఏవో ప్రయోగాలు చేస్తోందనే వదంతులు ఉన్నాయి.బ్రెజిల్‌కు చెందిన స్వయం ప్రకటిత పారానార్మల్ మైనర్ అథోస్, ఈ ప్రాంతం ఊహించనంత ఎక్కువ రహస్యాలను కలిగి ఉందని చెప్పారు.ఈ ప్రాంతంలో నేల స్థాయికి దిగువన ఒక సొరంగం ఉందని, ఇది త్రిమితీయ పోర్టల్‌కు దారి తీస్తుందని, అది 2023లో తెరవబడుతుందని తెలిపాడు.టెస్లా ట్విటర్ బాస్ ఎలోన్ మస్క్‌లకు ఏరియా 51లోని ఉప-భూభాగంలో ఉన్న శక్తి గురించి ఆలోచన ఉందని అథోస్ అభిప్రాయపడ్డారు.

అది భవిష్యత్ సాంకేతికత కోసం ఉపయోగించబడవచ్చని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube