ఏదైనా వ్యాపారం చేశామంటే ట్రెండ్‌కు తగ్గట్టు నడుచుకోవాలి.లేదా సరికొత్త ట్రెండ్ సృష్టించాలి.
ఈ నినాదాన్ని వీధి వ్యాపారి నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు అన్నీ అనుసరిస్తున్నాయి.కొన్నాళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి వేరుశనగలు, బాదం వంటి వాటిని చక్కగా అమ్మేశాడు.
కచ్చా బాదం అంటూ అతడు పాడిన పాట బాగా ట్రెండ్ అయింది.అది అతడి దశ మార్చింది.
ఇదే కోవలో కొందరు తమ రెస్టారెంట్లు, హోటళ్లకు ట్రెండీగా వెరైటీ పేర్లు( Funny Restaurant Names ) పెట్టుకుంటున్నారు.ఫలితంగా వారి వ్యాపారం అందరినీ ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా కొన్నాళ్ల క్రితం సెకండ్ వైఫ్ కర్రీస్( Second Wife Curries ) అనే పేరు బాగా వైరల్ అయింది.దీనిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తున్నాయి.
ఇదే తరహాలో ఓ వ్యక్తి పెట్టిన రెస్టారెంట్ పేరు బాగా ఆకట్టుకుంటోంది.అంతేకాకుండా చూసిన వారందరికీ నవ్వులు పంచుతోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.తమ వ్యాపారాలకు సంబంధించి చాలా మంది సరికొత్త ప్రచారం చేసుకుంటారు.కొందరు ఫుడ్ బాగుంటుందని, కొందరు తమ వద్ద ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందని ఇలా రకరకాల ప్రచారం సాగిస్తుంటారు.ఓ వ్యక్తి రాజమండ్రిలోని దానవాయిపేటలో సరికొత్త పేరును తన రెస్టారెంట్‌కు పెట్టాడు.‘నా పొట్ట నా ఇష్టం’( Na Potta Na Ishtam ) అని తన రెస్టారెంట్‌కు పేరు పెట్టుకున్నాడు.
ఇది చూసిన వారందరికీ నవ్వు వచ్చేస్తోంది.తెలంగాణలోని జగిత్యాలలో కూడా ఇదే పేరుతో మరో వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు.ఇక సోషల్ మీడియాలో వీటిపై ఫన్నీ మీమ్స్, కవితలు వస్తున్నాయి.
క్వాలిటీ భోజనాన్ని, రకరకాల ఆహార పదార్థాలను అందించడంతో పాటు కొందరు ఇలా క్యాచీగా రెస్టారెంట్లకు పేర్లు పెట్టి సరికొత్త ట్రెండ్‌ను వ్యాపారులు సృష్టిస్తున్నారు.ఇలా వెరైటీ పేర్లతో హైదరాబాద్ నగరంలో చాలా హోటళ్లు ఉన్నాయి.
తినేసి పో (కొంపల్లి),( Thinespo ) తిన్నంత భోజనం (నాగోల్ మెట్రో),( Thinnanta Bhojanam ) వివాహ భోజనంబు (జూబ్లీ హిల్స్), బకాసుర (ఏఎస్ రావు నగర్), దిబ్బరొట్టి, (మణికొండ), తాళింపు (అమీర్‌పేట్), ఉప్పు కారం (కొండాపూర్) వంటివి భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.