Pawan Kalyan : ఓవర్సీస్ లో సునామీ సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ విషయంలో ఆయనే కింగ్ అనేలా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan kalyan ) సాయి ధరమ్ తేజ్( Sai dharam tej ) కలిసి నటించిన రాజా చిత్రం బ్రో.ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Pawan Kalyan Bro Movie Gets Tremendous Response For Advance Booking In Usa And-TeluguStop.com

ఇందులో కేతికాశర్మ సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది.ఈ సినిమా జూలై 28న గ్రాండ్గా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దాంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నాయి.

Telugu Advance, Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movie

బ్రో సినిమా( Bro movie ) రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది.ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 22వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇక జూలై 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారుబ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తున్నది.ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారమే ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదని తెలిసింది.

ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికా, యూకేలో గ్రాండ్‌గా మొదలైంది.బ్రో సినిమా యూకే అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలైంది.,/br>

Telugu Advance, Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movie

ఈ సినిమాను 40 లొకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇంకా ఈ సినిమా లొకేషన్, స్క్రీన్ల కౌంట్ పెరిగే అవకాశం ఉంది.ఇప్పటి వరకు మొత్తంగా 52 షోల కోసం 3020 టికెట్లు అమ్ముడుపోయాయి.ఇంకా 7 రోజుల గడువు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube