Pawan Kalyan : ఓవర్సీస్ లో సునామీ సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ విషయంలో ఆయనే కింగ్ అనేలా?
TeluguStop.com
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన రాజా చిత్రం బ్రో.
ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో కేతికాశర్మ సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది.
ఈ సినిమా జూలై 28న గ్రాండ్గా విడుదల కానుంది.ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.
ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నాయి. """/" /
బ్రో సినిమా( Bro Movie ) రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది.
ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 22వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక జూలై 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారుబ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తున్నది.
ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారమే ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదని తెలిసింది.
ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికా, యూకేలో గ్రాండ్‌గా మొదలైంది.బ్రో సినిమా యూకే అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలైంది.
,/br> """/" /
ఈ సినిమాను 40 లొకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇంకా ఈ సినిమా లొకేషన్, స్క్రీన్ల కౌంట్ పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు మొత్తంగా 52 షోల కోసం 3020 టికెట్లు అమ్ముడుపోయాయి.ఇంకా 7 రోజుల గడువు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?