నిహారిక కోసం పెద్ద త్యాగం చేసిన లావణ్య త్రిపాఠి... అయిన ఫలితం లేదా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati) త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘంగాన జరిగింది.

 Lavanya Tripathi Made A Big Sacrifice For Niharika, Lavanya, Varun Tej, Niharik-TeluguStop.com

త్వరలోనే వీరి వివాహం(Marriage) కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగనుంది.ఇలా వీరి పెళ్లి జరగబోతుంది అని తెలియగానే వీరికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లావణ్య వరుణ్ ఇద్దరు కూడా మిస్టర్ సినిమా( Mister Movie ) లో కలసి నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

ఇలా గత కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లికి సిద్ధపడ్డారు.

ఇకపోతే వీరి వివాహం గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నిహారిక ( Niharika ) వివాహం పూర్తి కాగానే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని భావించారు.అంతలోపు నీహారికకు తన భర్త వెంకట చైతన్యతో( Venkata Chaitanya ) విభేదాలు రావడంతో వీరిద్దరి వివాహం చాలా ఆలస్యంగా అవుతుందని తెలుస్తుంది.

ఎలాగైనా నిహారిక చైతన్య కాపురం నిలబెట్టాలని లావణ్య చాలా ప్రయత్నాలు చేశారట.ఇలా వీరిద్దరి మధ్య గొడవలు సర్ధుమనిగి ఇద్దరు సంతోషంగా ఉన్న తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారట.

ఇలా నిహారిక కాపురం చక్కబెట్టడం కోసం లావణ్య ఏడాది పాటు ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోవడం వల్ల ఇక లావణ్య వరుణ్ ఇద్దరు కూడా ఈ ఏడాది వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారు.ఇకపోతే వీరి వివాహం గత ఏడాదే జరిగేదని తెలుస్తుంది.అయితే నిహారిక వివాహం జరిగి రెండు సంవ్సరాలు అయినప్పటికీ తన భర్తతో విడాకులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.వీరిద్దరి విడాకుల గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోయినా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనీ వార్తలు వస్తున్నాయి.

ఇక లావణ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకకు చైతన్య రాకపోవడంతో వీరిద్దరి విడాకులు నిజమేనంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

https://youtube.com/shorts/PZUu1u1WtkU?feature=share3
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube