ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకి హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నా నటించమని దర్శక నిర్మాతలు సంప్రదిస్తే ఆమె బాలయ్యతో నటించేందుకు ససేమేరా అంటూ నో చెప్పిందట.
దీంతో ప్రస్తుతం ఈ సమస్యని బాలయ్యబాబుతో పాటూ మన్మథుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం నాగార్జున వైడ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం లో నాగార్జున సీరియస్ పాత్ర అయినటువంటి ఓ ఎన్కౌంటర్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు.దీంతో ఈ చిత్ర యూనిట్ సభ్యులు నాగార్జునకి సరి జోడిగా పలువురు హీరోయిన్లను సెలెక్ట్ చేశారు.
కాకపోతే ఈ లిస్ట్ లో నాగార్జున కంటే వయసు తక్కువ ఉన్నవారు కావడంతో కొంత మంది నాగార్జునతో నటించడానికి ఒప్పుకోవడం లేదట.