అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఒకరికొకరు బూతులు తిట్టుకునే స్థాయికి దిగజారిపోయిన ప్రస్తుత తరుణంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana assembly meetings ) కొంత బాధ్యతాయుత వాతావరణంలోనే జరుగుతూ ఉండటం కొంత అంత ఆశావాహంగా కనిపిస్తుంది.అయితే ప్రత్యర్థులను విమర్శించడానికి దిగజారుడు భాష ఉపయోగించ వలసిన అవసరం లేదని అద్భుతమైన వాక్చాతుర్యంతో సేటైర్స్ వేసి కూడా ప్రత్యర్థులు గాలి తీయొచ్చని బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )నిరూపించారు .
బారాశా ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు భాజపా నాయకులు చేస్తున్న విమర్శలను సహేతుకమైన సాక్షాదారాలతో సహా తిప్పుకొడ్తున్న కేటీఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల పై అంశాలు వారి వివరణ ఇస్తూ సాక్షాదారాలను బయటకు తీస్తున్న కేటీఆర్ వారి హయాంలో జరిగిన తప్పులను చెప్పటప్పుడు సమయోచితంగా సందర్భోచితంగా పిట్టకథలతో సహ వివరిస్తూ చెబుతూ అద్భుతమైన చాణిక్య నీతిని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి .పనిలోపనిగా హైదరాబాదును నేనే కట్టా నంటూ చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్యలపై కూడా ఒక పిట్ట కథ చెప్పిన కేటీఆర్ సభ మొత్తం నవ్వులు పూయించారు .నిజానికి చంద్రబాబుపై ఈ తరహా విమర్శలు చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అధికార వైసిపి ఎప్పుడు తిట్ల భాషనే ఉపయోగిస్తుంది.ముఖ్యంగా కాంగ్రెస్ నేత శ్రీధర్ ( Congress leader Sridhar )మరియు బాజాపా నేత ఈటెల రాజేందర్ ( Etela Rajender )కు సమాధానం చెబుతున్నప్పుడు కేటీఆర్ ఉపయోగించిన భాష రాజకీయాల్లో హుందాతనం అంటే ప్రత్యర్థి పార్టీల నాయకులు నేర్చుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపించింది అని చెప్పవచ్చు.
తమ సభను రాష్ట్రం గమనిస్తున్నదని తమ వ్యవహార శైలిని, ఉపయోగిస్తున్న బాషను , తమ నాయకత్వ లక్షణాలను ప్రజలు గమనిస్తున్నారు అన్న స్పృహ రాజకీయ నాయకులు కలిగి ఉండటం అన్నది అతి ముఖ్యమైన అంశమని రాజకీయ నాయకులు( Politicians ) గుర్తుపెట్టుకోవాలి.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న విధానంతో పోలిస్తే తెలంగాణ అసెంబ్లీ పది అడుగులు ముందుకు ఉన్నట్టుగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు .ఏది ఏమైనా కెసిఆర్ తర్వాత బారాస బలహీనపడుతుందని అంచనా వేసిన వారికి కెసిఆర్ లక్షణాలను పుణికి పుచ్చుకొని ఆయనకంటే నాలుగాకులు ఎక్కువ చదివినట్టుగా చెలరేగిపోతున్న కేటీఆర్ దూకుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట .