యూఎస్ కాంగ్రెస్ బరిలో ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త కృష్ణ బన్సాల్

భారత సంతతి అమెరికన్ పౌరుడు, ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణ బన్సాల్ యూఎస్ ప్రతినిధుల సభ బరిలో నిలిచారు.రిపబ్లికన్ పార్టీ తరపున 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి పోటి చేస్తున్న బన్సాల్ గత వారాంతంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు.

 Krishna Bansal Us Congress-TeluguStop.com

ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ఎన్నికైన అధికారులు, ఇండో-అమెరికన్ సంతతికి చెందిన నేతలతో పాటు బన్సాల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృష్ణ బన్సాల్ మాట్లాడుతూ.

తాను దేశాన్ని ప్రేమిస్తున్నానని కాబట్టే కాంగ్రెస్ బరిలో నిలిచానని స్పష్టం చేశారు.సోషలిజం, కెరీర్ పాలిటీషియన్స్, నియంత్రణ పన్నులు, ఇతర ఖర్చులకు వాటిల్లే ముప్పు నుంచి రక్షించేందుకు తాను పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా, దాని విలువలు, రాజ్యాంగాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తానని.ఈ దేశం చాలా ఇచ్చి, తన కల నిజం చేసిందని బన్సాల్ గుర్తుచేశారు.

ఇప్పుడు తాను అమెరికన్ల కలను నిజం చేసేందుకు కృషి చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు.

Telugu Indianamerican, Krishna Bansal, Telugu Nri Ups, Congress-

ఫ్రీ ఎంటర్‌ప్రైజ్, ఆర్ధిక క్రమశిక్షణ, కుటుంబ విలువలు, దృఢమైన విదేశాంగ విధానంపై తాను ప్రధానంగా దృష్టి పెడతానని కృష్ణ వెల్లడించారు.ఈ సందర్భంగా మాజీ నాపెర్విల్లే స్టేట్ రిపబ్లిక్, 2018లో ఇల్లినాయిస్ స్టేట్ కంప్ట్రోలర్ రిపబ్లికన్ నామినీ డార్లీన్ సెంగెర్ మాట్లాడుతూ.బన్సాల్‌కు ఇది విజయవంతమైన పోటీగా అభివర్ణించారు.

ఐదేళ్ల క్రితం ఈ పదవిలో ఉన్న డెమొక్రాటిక్ బిల్ ఫోస్టర్‌కు వ్యతిరేకంగా 47 శాతం ఓట్లు సంపాదించడంలో బన్సాల్ విజయం సాధిస్తారని సెంగెర్ ఆకాంక్షించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube