ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.2019 కంటే 2024 ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది.ఈ క్రమంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జాయిన్ అవుతున్న నాయకులు లిస్ట్ పెరిగిపోతోంది.కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల( Sharmila ) రావడం తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నాని.
వైసీపీలో జాయిన్ కావడం తెలిసిందే.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ( Konathala Ramakrishna ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భేటీ అయ్యారు.ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్ తో చర్చించానని వెల్లడించారు.ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని పవన్ ను కోరినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 2 లేదా 4న అనకాపల్లిలో( Anakapalli ) పవన్ సభ ఉంటుందన్నారు.భేటీ సందర్భంగా ఆయనను ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కోరినట్లు కొణతాల చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో వైసీపీ పార్టీపై విమర్శలు చేశారు.
వైసీపీ( YCP ) నుండి అంతా బయటకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఏపీ పీసీసీ అధ్యక్షురాలు హోదాలో వైయస్ షర్మిల తనని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు.ఈ క్రమంలో తాను జనసేనలో( Janasena ) జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి రాలేనని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాను షర్మిల వైసీపీలో ఉండాల్సిన వాళ్ళము.కాని పార్టీలో ఉన్న పరిస్థితులు కారణంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించాల్సిన అవసరం ఉందని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు.