వీరసింహారెడ్డి డైలాగ్స్ పై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్.. వెంట్రుక అంటూ?

వీరసింహారెడ్డి సినిమాలో వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే.అభివృద్ధి విషయంలో, ఇతర విషయాలలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్న ఆ డైలాగ్స్ పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 Kodali Nani Shocking Comments About Veerasimhareddy Movie Details Here Goes Vira-TeluguStop.com

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్ లను సినిమాలో తొలగించే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని కొంతమంది చెబుతున్నారు.మరోవైపు సినిమాలో హింస ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి వీరసింహారెడ్డి సినిమా డైలాగ్ లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వీరసింహారెడ్డి సినిమాను తాను చూడలేదని ఆయన తెలిపారు.సీఎం జగన్ ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతారని కొడాలి నాని కామెంట్లు చేశారు.వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగ్స్ వల్ల ఏపీ ప్రభుత్వానికి వెంట్రుక కూడా ఊడదని కొడాలి నాని తెలిపారు.

మేము ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.చంద్రబాబు దొంగ అని ఆ దొంగ వెనుక బాలయ్య నిలబడ్డారని కొడాలి నాని పేర్కొన్నారు.బాలయ్య రీల్ హీరో జగన్ రియల్ హీరో అని కొడాలి నాని చెప్పుకొచ్చారు.మూడు రోజుల తర్వాత ఆ డైలాగ్ లను ఎవరూ పట్టించుకోరని ఆయన కామెంట్లు చేశారు.

బాలయ్య ఇలాంటి డైలాగ్ లతో ఎన్నో సినిమాలు చేశారని కొడాలి నాని పేర్కొన్నారు.

కొడాలి నాని కామెంట్లపై కొంతమంది పాజిటివ్ గా చెబుతుంటే మరి కొందరు నెగిటివ్ గా చెబుతున్నారు.మరోవైపు వీరసింహారెడ్డి నాలుగు రోజుల్లో ఏకంగా 104 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.సీడెడ్, గుంటూరు జిల్లాలలో ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది.

రేపటితో సెలవులు ముగియనున్న నేపథ్యంలో వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube