ఈ మధ్యకాలంలో తమిళ సినిమాలకు తెలుగులో ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా హీరో కార్తీ(Karthi ) అను ఇమ్మానుయేల్ నటించిన జపాన్ (Japan Movie) సినిమా కూడా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాజా మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పిక్చర్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి తెలుగులో కూడా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాన్ని వస్తే.
కథ:
పుట్టుకతోనే పేదరికంలో పుట్టినటువంటి జపాన్ (కార్తీ) పొట్ట కూటి కోసం ఏ పని చేయాలో తెలియక చిన్నతనం నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు, ఇలా దొంగతనాలు చేస్తున్నటువంటి ఈయనకు ఒకసారి భారీ డీల్ వస్తుంది మంత్రి గారి ఇంట్లో డబ్బు దొంగతనం చేసే డీల్ జపాన్ కి( Japan ) వస్తుంది.ఈ డీల్ ఒప్పుకున్నటువంటి జపాన్ ప్లానింగ్ ప్రకారం మంత్రిగారి ఇంట్లో డబ్బు దొంగతనం చేస్తారు.
అయితే అదే రోజు రాత్రి మంత్రి గారి ఇంట్లో మర్డర్ కూడా జరుగుతుంది.ఆ మర్డర్ కేస్ జపాన్ మెడకు చుట్టుకుంటుంది.ఈ కేసు నుంచి ఈయన ఎలా బయటపడ్డారు? మర్డర్ చేసింది ఎవరు? ఈ మర్డర్ వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నదే ఈ సినిమా కథ.
ఈ నటుల నటన:
కార్తీ కెరియర్ లో ఈ సినిమా 25వ సినిమా కావటం విశేషం ఈ క్రమంలోనే తన పాత్రకు అనుగుణంగా కార్తీ తన బాడీ లాంగ్వేజ్ తో 100% ఈ సినిమాకు న్యాయం చేశారని చెప్పాలి.ఈ సినిమాలో కార్తీక్ నటన( Karthi Acting ) అద్భుతంగా అనిపించింది ఇక హీరోయిన్ అను ఇమ్మానుయేల్( Anu Emmanuel ) పాత్ర పెద్దగా లేకపోయినా ఉన్న ఉన్నంతవరకు ఆమె కూడా బాగా నటించారు.ఇతరులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి.
టెక్నికల్:
రాబరీ జానర్( Robbery Genre Movie ) సినిమాలను ప్రేక్షకులు ఆద్యంతం ఉత్కంఠ తో తర్వాత ఏమి జరగబోతుంది అనే సస్పెన్స్ మరియు ట్విస్టులతో స్క్రీన్ ప్లే నడిపించాలి.అప్పుడే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.జపాన్ విషయంలో డైరెక్టర్ అదే చేశారని చెప్పాలి.కార్తీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా, చాలా డిఫెరెంట్ గా ఈ పాత్రని డిజైన్ చేసి వినోదం అని అందించాడు.
సినిమాటోగ్రఫీ పరవాలేదు మ్యూజిక్ కూడా పరవాలేదు.పాటలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
విశ్లేషణ:
ఈ సినిమాలో కార్తీ గెటప్ దగ్గర నుండి డైలాగ్ డెలివరీ వరకు ప్రతీ ఒక్కటి ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేసాడు.ఆ ప్రయత్నం లో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.అక్కడక్కడ సినిమాలు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కాస్త సినిమా కూడా రోటీన్ కథలాగే అనిపించింది.సెకండ్ హాఫ్ లో ల్యాగ్ లు కూడా బాగా ఎక్కువయ్యాయి.
ప్లస్ పాయింట్స్:
కార్తీ నటన, స్క్రీన్ ప్లే అద్భుతంగా డిజైన్ చేశారు.సినిమాలో వినోదాత్మక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ ల్యాగ్ లు ఎక్కువగా ఉన్నాయి.మధ్యలో కొన్ని సన్నివేశాలను సాగదీశారు.
బాటమ్ లైన్:
రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి జపాన్ సినిమా కార్తీ విభిన్నమైనటువంటి నటన బాడీ లాంగ్వేజ్ తో మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందని చెప్పాలి.