బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి( Bhagavanth kesari ) అక్టోబర్ 19న రిలీజ్ అయి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది.ఈ సినిమాలో శ్రీలీల బాగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
అనిల్ రావిపూడి ( Anil Ravipudi )ఆమె క్యారెక్టర్ ను చాలా బాగా రాశాడు.బహుశా ఆమె తనకు బంధువనే ఫీలింగ్ తో అలా రాసాడేమో కానీ ఆ పాత్ర మాత్రం చాలా స్కోప్ ఉన్న రోల్ అని చెప్పవచ్చు.
బాగా నటించడం రావాలే కానీ శ్రీ లీల పాత్రను వేరే లెవెల్ కి తీసుకెళ్లొచ్చు.
అయితే శ్రీలీల( Srileela ) తన టాలెంట్ మేరకు ఈ పాత్రను బాగానే పండించింది.బాలకృష్ణ( Balakrishna ) కూతురుగా, విజ్జి పాపగా అదరగొట్టేసిందనే చెప్పాలి.హీరో సెంట్రిక్ గా కాకుండా ఓన్లీ స్టోరీనే హీరోగా ఈ మూవీ రూపొందింది.
అందుకే మొదటి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది.ఇప్పటిదాకా గ్లామర్ షో చేయడానికి పరిమితమైన శ్రీ లీల ఈ సినిమాలో డి గ్లామర్ లుక్ లో కనిపించింది.
ఈసారి ఓన్లీ తన నటనతోనే ఆమె ఆకట్టుకుంది.బాలకృష్ణ దత్తత బిడ్డ పాత్రలో ఆమె కొన్ని సన్నివేశాల్లో నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది.
బాలకృష్ణ లాంటి అనుభవం ఉన్న నటుడుతో ఆమె సమానంగా నటించేసింది.ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాల్లో బాలయ్య ఒక్కడే హైలెట్ అయ్యేవాడు కానీ ఈ సినిమాలో శ్రీలీల కూడా బాలయ్యతో సమానంగా స్క్రీన్ టైమ్ పొందింది.
అలాగే ఆమె పాత్రకు కూడా బాలయ్యతో సమానమైన ప్రయారిటీ లభించింది.
అయితే పెళ్లయిన తర్వాత కాజల్ మంచి పాత్రలను పొందలేకపోతోంది.భగవంత్ కేసరిలో కూడా కాజల్ అగర్వాల్( Kajal agarwal ) పాత్ర సినిమాకి పెద్దగా ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయలేదు.బాలకృష్ణతో ఆమె సీన్స్ ప్రభావం చూపలేదు.
నిజానికి కాజల్ చేసిన డాక్టర్ కాత్యాయని ఒక స్కోప్ ఉన్న పాత్రే.బాలకృష్ణ లవర్, విజ్జి పర్సనల్ సైకియాట్రిస్ట్ గా కాజల్ కనిపిస్తుంది.
అనిల్ ఆ పాత్ర స్కోప్ కావాలనుకుంటే పెంచగలడు కానీ ఎందుకో ఆ పాత్రను పెద్దగా గొప్పగా తీర్చిదిద్దలేదు.ఏది ఏమైనా శ్రీ లీల చేసిన పాత్ర మాత్రం చాలా బాగుంది.
ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.థియేటర్లకు ప్రేక్షకులు వచ్చేలా చేస్తోంది.
ఇది బాలకృష్ణ రొటీన్ సినిమా లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా మంచి కథా బలంతో రావడం వల్ల సినిమాకి ప్లస్ అయ్యింది.