యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) డ్యాన్స్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎలాంటి పాటకు అయినా అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ తారక్ కు ఉంది.
తారక్ కు యూత్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా అన్ని వర్గాల ప్రేక్షకులను తారక్ తన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తున్నాయి.అయితే టాలీవుడ్ హీరోలలో డ్యాన్స్ విషయంలో ఎన్టీఆరే తోపని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డ్యాన్సర్ పండు( Dancer Pandu ) ఒక సందర్భంలో మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని తారక్ బాగా డ్యాన్స్ వేస్తారని ఆయన తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు చూశానని జై లవకుశ మూవీ( Jai Lava Kusa ) షూట్ కు వెళ్లగా ట్రింగ్ ట్రింగ్ సాంగ్ షూట్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ కు వచ్చారని ఆ సమయంలో తారక్ చూసిన వెంటనే డ్యాన్స్ స్టెప్స్ వేశారని పండు వెల్లడించారు.

32 కౌంట్స్ ను గుర్తు పెట్టుకోవాలంటే సులువైన విషయం కాదని శేఖర్ మాస్టర్( Sekhar Master ) డ్యాన్స్ స్టెప్స్ చూపించిన వెంటనే తారక్ డ్యాన్స్( NTR Dance ) చేసి టేక్ ఓకే అయ్యేలా చేశారని పండు చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి తెలిసి యంగ్ టైగర్ ఫ్యాన్స్ మరింత సంతోషిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.తారక్ ఎనర్జీ లెవెల్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో( Devara Movie ) గూస్ బంప్స్ సీన్లు ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది.దేవర సినిమా గ్లింప్స్ త్వరలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది.దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన విడుదల కానుంది.