జోర్దార్ వార్తలు ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుజాత ( Sujatha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జోర్దార్ సుజాత అనంతరం బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లి మరింత గుర్తింపు పొందారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) స్కిట్లో చేస్తూ జబర్దస్త్ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇకపోతే రాకింగ్ రాకేష్ తో ప్రేమలో పడినటువంటి జోర్దార్ సుజాత ఏకంగా ఆయననే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
ఇలా పెళ్లి తర్వాత కెరియర్ పరంగా సుజాత కూడా ఎంతో బిజీగా ఉన్నారో ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమం చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ కూడా బిజీగా ఉన్నారు.
మరోవైపు ఈమె యూట్యూబ్ ఛానల్( Super Sujatha YouTube Channel ) కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొంటూ ఉన్నారు.తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తన కారుకు ప్రమాదం( Car Accident ) జరిగింది అంటూ ఒక వీడియోని అభిమానులతో పంచుకున్నారు.తాము ప్రయాణం చేస్తుండగా ఒక వ్యక్తి తమ కారుకి ఢీ కొట్టారని సుజాత తెలియజేశారు.
మేము సీట్ బెల్ట్ పెట్టుకున్నాం కనుక మాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ బైక్ పై మా కారుకు ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి హెల్మెట్ కూడా పెట్టుకోవడం లేదని ఈమె తెలియజేశారు.
అదృష్టం బాగుండి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు రోడ్డుపై వెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళిన ఎదుటివారు ఎలా వస్తారో మనకు తెలియదు కనుక ప్రతి ఒక్కరు బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్( Helmet ) తప్పనిసరిగా పెట్టుకోవాలని అలాగే కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటూ ఈమె పలు జాగ్రత్తలను తెలియజేశారు.మనం బయటకు వచ్చాము అంటే ఇంట్లో మన కోసం మన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండండి అంటూ సుజాత తెలియజేశారు.అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాలేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.