టి .బిజెపికి వ్రతం చెడినా ఫలితం దక్కడం లేదా ?

ఆంధ్ర ప్రాంతపు పార్టీతో పొత్తు పెట్టుకుందని అపప్రదని కూడా మోయడానికి సిద్ధమయ్యి జనసేన( Jana sena )తో పొత్తుకు ముందుకొచ్చిన బిజెపికి కు దానికి తగ్గ ఫలితం మాత్రం అందటం లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన పార్టీగా ఉన్న జనసేన తెలంగాణలో కేవలం రిజిస్టర్ పార్టీగా మాత్రమే ఉండడంతో దానికి కామన్ సింబల్ ను ఇచ్చే అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రక్కన పెట్టేయడం తో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసు ను ఫ్రీ సింబల్గా ఎలక్షన్స్ కమిషన్ రిజిస్టర్ చేసిందని, ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో ఆ గాజు గ్లాస్ గుర్తును సాధారణ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కేటాయించవచ్చని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ గండి పడుతుందో అని కమలనాథులు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది .

 Janasena Sybol Tension For T Bjp , Janasena, Telangana Bjp , Telangana Elections-TeluguStop.com
Telugu Glass Symbo, Janasena, Kishan Reddy, Narendra Modi, Pawan Kalyan, Telanga

ఎన్నికల హడావుడి లో పడి టెక్నికల్ విషయాలను మర్చిపోయినందుకు ఇప్పుడు ఆ పార్టీ మూల్యం చెల్లిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు వివిధ నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుతో( Glass Symbo ) పోటీ చేసి తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ కోత పెడతారో అన్న భయం ఇప్పుడు జనసేన కన్నా బిజెపి నాయకులనే ఎక్కువ బయపెడుతుందట ఎందుకంటే జనసేన జనసేనకు ఉన్న పాజిటివ్ ఓటు బ్యాంకు ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించిన బిజెపి( BJP Party ) అధిష్టానం జనసేనతో పొత్తు నిర్ణయానికి వచ్చింది.8 స్థానాలను జనసేనకు కేటాయించి మిగిలిన స్థానాలలో ఆ పార్టీ మద్దతును కోరుతుంది.

Telugu Glass Symbo, Janasena, Kishan Reddy, Narendra Modi, Pawan Kalyan, Telanga

బహుముఖ పోటీ ఉండటంతో పదుల సంఖ్యలో ఓట్లు కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయన్న అంచనాలను నేపథ్యంతో ఈ గుర్తు ఫ్రీ సింబల్ అవడంతో కొన్ని నియోజకవర్గాల్లో తమకు ఇబ్బందికర వాతావరణ ఏర్పడుతుందన్న అంచనాలలో ఆ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి చట్టపరమైన అవకాశాలను పరిశీలించి తమకు లబ్ధి చేకూరే విధంగా న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లే ఉద్దేశంలో ఆ పార్టీ కీలక నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube