ఆ కమిటీలను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్న జనసేన !

ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ముందుకు వెళ్తుండడంతో ఈ రేసులో వెనుకబడ్డామనే ఆలోచనలో ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కొంచెం దూకుడు పెంచింది.దీనిలో భాగంగానే… జిల్లాల వారీచేస్తోంగా పార్టీని పటిష్టం చేయడంపై దృష్టిసారించిన పవన్ వివిధ కమిటీలను ఎంపిక చేసే పనిలో పడ్డాడు.

 Janasena Party Prepared Parliamentary Commitees-TeluguStop.com

దీనిలో భాగంగా పార్లమెంట్ స్థాయి పార్టీ కమిటీల ఎంపికను దాదాపు పూర్తి చేసింది జనసేన.ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశాల్లో కమిటీల ఎంపికపై కసరత్తు చేసింది.

జాబితాలను సీనియర్ నాయకులు ఫైనల్ చేసే పనిలో పడ్డారు.

నాయకులు, కేడర్‌కు వేర్వేరుగా కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకరాం కమిటీల ఎంపికపై దృష్టిపెట్టారు.ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ స్థానాలకు నియోజకవర్గ నేతలకు స్థానం కల్పిస్తూ తుది జాబితాను సిద్ధం చేసిన జనసేన పార్టీ నాయకత్వం… శుక్రవారం తుది జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అందజేయనున్నారు.ఈ జాబితాను పరిశీలించిన తర్వాత ఈ నెల 20వ తేదీ తర్వాత కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube