బాబుపై ఒత్తిడి పెంచేస్తున్న జనసేన ?

రాష్ట్ర రాజకీయాల్లో శరవేగం గా నిర్ణయాలు తీసుకుంటూ అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం లో( TDP ) కూడా జనసేన ( Janasena ) స్పీడ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందంటున్నారు .ఇప్పటివరకు పార్టీని రూట్ లెవెల్ లో బలపరుచుకోలేదన్న విమర్శలను సరిచేస్తూ జెట్ స్పీడ్ తో నిర్ణయాలు తీసుకుంటున్న జనసేనా ని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఇన్చార్జుల ప్రకటించేశారు .

 Janasena Increasing Pressure On Chandrababu Details, Janasena, Tdp, Pawan Kalyan-TeluguStop.com

ఇప్పుడు వారికి సీట్ల హామీని కూడా ఇచ్చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా కీలక నాయకులను గుర్తించి వారిని పార్టీలోకి ఆహ్వానించే పనిని కూడా మొదలుపెట్టేశారు ఇంతకాలం నిబద్ధత కలిగిన నాయకులనే పార్టీలోకి తీసుకుంటామని చాలావరకు ఆశావాహులను నిరాశపరచిన జనసేనాని రాజకీయ ప్రయాణంలో ధనం ఎంత ప్రాముఖ్యత కలిగినదో గుర్తించారని అందువల్ల కనీసం కొన్ని స్థానాలలో అయినా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న రాజకీయ నాయకులను పార్టీలోకి తీసుకోవడం ప్రారంభించారని తెలుస్తోంది.

Telugu Amanchi Swamulu, Chandrababu, Janasentdp, Janasena, Pawan Kalyan, Tangell

ఆమంచి స్వాములు,( Amanchi Swamulu ) పంచకర్ల రమేష్ బాబు,( Panchakarla Ramesh Babu ) టీ టైం అధినేత తంగేళ్ల ఉదయ్ ఇలాంటి వారి చేరిక దీనికి సాక్ష్యం అని చెబుతారు.అంతేకాకుండా తమ పార్టీలో మొదటనుంచి ఉన్న కీలక నాయకులకు కూడా కచ్చితంగా సీటు హామీను జనసేన ఇచ్చేస్తుందని, ఇది తెలుగుదేశంతో చేయబోయే పొత్తు చర్చ లలో ప్రధాన అడ్డంకిగా మారుతుంది అంటూ విశ్లేషణలు వస్తున్నాయి.పూర్తిస్థాయిసమాలోచన ల తర్వాత నిర్ణయం తీసుకొని సీట్ల కేటాయింపు చేసుకోవాలి, కానీ ఇలా ఎవరికి వారు సీట్లను కన్ఫర్మ్ చేసుకుంటే ఇక పొత్తుకు అర్థమేం ఉంటుందంటూ తెలుగు తమ్ముళ్లు అధినేతపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.

Telugu Amanchi Swamulu, Chandrababu, Janasentdp, Janasena, Pawan Kalyan, Tangell

ముఖ్యంగా తెలుగుదేశం రాజకీయ ఉద్దండులు బలంగా ఉన్న కొన్ని సీట్లలో జనసేన కర్చీఫ్ వేస్తుండటాన్ని వీరు సహించలేకపోతున్నట్లుగా తెలుస్తుంది .అవసరమైతే కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించిన ఫార్ములానే మనం ఫాలో అవుదామని అక్కడ కింగ్ మేకర్ అవ్వాలనుకున్న జెడిఎస్ ఆశలు ఎలా అయితే ఆవిరి అయిపోయాయో ఇక్కడ జనసేనకు కూడా ఆ పరిస్థితుని సృష్టిద్దాం అంటూ అధినేతపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.అయితే పొత్తులు లేకపోతే గెలుపు పై ఆశలు లేవని, ఉండవని బలంగా నమ్ముతున్న చంద్రబాబు ( Chandrababu Naidu ) మరి తమ్ముళ్ళ ఒత్తిడికి ఏ మేరకు లొంగుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube