జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు ఇప్పుడేమి లేవన్నారు.
అదేవిధంగా ఎవరూ పోటీ చేస్తారో తెలియదని చెప్పారు.అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించాలని తెలిపారు.
ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కవిత మద్ధతుతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలను చేశారు.
ఈ నేపథ్యంలోనే తాను పోటీ చేసినా చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజా వ్యాఖ్యలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరం కానున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారడంతో ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.